/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T185400.691.jpg)
Director Bucchibabu Father Passed Away : 'ఉప్పెన' మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు శుక్రవారం ఉదయం కన్ను మూసారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. తండ్రి మరణంతో బుచ్చిబాబు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈరోజు సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బుచ్చిబాబు తండ్రి మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ బచ్చిబాబు తండ్రి పెదకాపు మరణం పట్ల నివాళి అర్పించారు.
Also Read : కేసీఆర్ చేతుల మీదుగా ‘KCR’ మూవీ సాంగ్ రిలీజ్.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!
Director Buchi Babu father no more 🙏
RIP pic.twitter.com/M8sFPVaIya— Sreedhar Sri (@SreedharSri4u) May 31, 2024
ఇక బుచ్చిబాబు విషయానికొస్తే.. సుకుమార్ దగ్గర కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. 2021 లో 'ఉప్పెన' సినిమాతో (Uppena Movie) దర్శకుడిగా మారాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మొదటి సినిమాతోనే బుచ్చిబాబు 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.