టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దినేశ్ కార్తీక్!

2024 -ఐపీఎల్ సీజన్ లో సంపూర్ణ రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కింది.

New Update
టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దినేశ్ కార్తీక్!

భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత కొత్త అవతారం ఎత్తనున్నాడు. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కింది.ప్రతిభావంతులైన నేటి తరం క్రికెటర్లకు అస్సలు రిటైర్మెంటే లేదని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తికాదు. క్రికెటర్లుగా తమ జాతీయ, రాష్ట్ర జట్టుకు ఆడినంత కాలం మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు, ఐపీఎల్ ద్వారా ఫ్రాంచైజీ కాంట్రాక్టుల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించే స్టార్ ప్లేయర్లు..శరీరం సహకరించక రిటైర్మెంట్ ప్రకటించినా. కామెంటీటర్లుగానో..మ్యాచ్ రిఫరీలుగానో..అంపైర్లుగానో, క్రికెట్ శిక్షకులుగానో లేక బోర్డు కార్యవర్గ సభ్యులుగానో కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇప్పుడు ..అదే జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు దినేశ్ కార్తీక్ సైతం చేరిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఆఖరిమ్యాచ్ .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున...రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా ఐపీఎల్ -17 ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ తో తన క్రికెట్ కెరియర్ కు స్వస్తి పలికిన కొద్దిగంటల్లోనే..ప్రపంచకప్ క్రికెట్ వ్యాఖ్యాతల జాబితాలో దినేశ్ కార్తీక్ చోటు సంపాదించాడు. చివ‌రి మ్యాచ్‌లో ఫెయిల్‌ అమెరికా, కరీబియన్ ద్వీపాల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి 28 రోజులపాటు ..55మ్యాచ్ లుగా సాగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కామెంటరీ ప్యానెల్ ను ఐసీసీ ప్రకటించింది.

ఈ బృందంలో దినేశ్ కార్తీక్ తో పాటు..సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ సైతం చోటు సంపాదించాడు. కామెంట్రీ బృందంలోని ప్రముఖుల్లో రవిశాస్త్రి, నాసిర్ హుస్సేన్, హర్షా బోగ్లే, ఇయాన్ స్మిత్, మెల్ జోన్స్, ఇయాన్ బిషప్ సైతం ఉన్నారు. ఇబోనీ రెయిన్ ఫోర్డ్- బ్రెంట్, సామ్యూల్ బద్రీ, కార్లోస్ బ్రాత్ వెయిట్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, లిసా స్థాలేకర్ లతో పాటు..ఎక్స్ పర్ట్ కామెంటీటర్లుగా రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హెడన్, రమీజ్ రాజా, వోయిన్ మోర్గాన్, టామ్ మూడీ, వాసిం అక్రం వ్యాఖ్యానం చేయనున్నారు.

ప్రపంచకప్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కోసం ఐసీసీ భారీ బృందాన్ని సిద్ధం చేసింది. గ్రీమ్ స్మిత్, మైకేల్ అథెర్టన్, వకార్ యూనిస్, సైమన్ డూల్, షాన్ పోలాక్, కేటీ మార్టిన్, పుమెలోలూ ఎంబాగ్వా, నటాలే జెర్మోనోస్, డానీ మోరిసన్, అలీసన్ మిచెల్, అలన్ విల్కిన్స్, బ్రియాన్ ముర్గోట్రాడ్, మైక్ హాజ్ మాన్, ఇయాన్ వార్డ్, అథర్ అలీఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓ బ్రియాన్, కాస్ నాయుడు, డారెన్ గంగా కూడా ప్రపంచకప్ మ్యాచ్ లకు వ్యాఖ్యానం అందించనున్నారు. నిన్నటి వరకూ ఓ ఆటగాడిగా ఉన్న తాను..ఇక ..తన సహాఆటగాళ్ల పై కామెంట్రీ చెప్పడం తనకు గొప్పగా అనిపిస్తోందని, ప్రపంచకప్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు దినేశ్ కార్తీక్ చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు