Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు!

గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు.

New Update
Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు!

AP News: ఎద్దుల పందెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జనం భారీ సంఖ్యలో వేడుకకు హాజరుకావడంతో వారి అరుపులకు బెదిరిపోయిన ఓ ఎద్దు జనంపైకి తిరగబడింది. ఈ క్రమంలోనే ఓ యువకుడిని పొడిచి చంపింది. మరొక వ్యక్తిని తన కొమ్ములతో తీవ్రంగా గాయపరచగా.. ఈ దాడిలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు తిరుపతి జిల్లాలో గంగ జాతర పురస్కరించుకొని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కొట్టాల గ్రామంలో ఎద్దుల పందెం నిర్వహించారు. ఆంధ్ర తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో ఎద్దులు పరుగు పందానికి తరలివచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి పేరు గల ఒ ఎద్దు వీధిని చూపుతున్న సమయంలో బెదిరిపోయి జనం పైకి తిరగబడింది. ఈ ఎద్దు దాడిలో బంగారుపాళ్యం మండలానికి చెందిన దిలీప్ కుమార్ (42) కాలి పిక్కపై పొడవడంతో తీవ్ర గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే దిలీప్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దిలీప్ కుమార్ తో పాటు గాయపడ్డ పలువురుకి వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం స్థానిక ఎస్సై రామాంజనేయులు.. ఎద్దుల పోటీలను ఆపేయాలని నిర్వాహకులను ఆదేశించారు. మృతుడు దిలీప్ కుమార్ చెన్నైలో బీరువా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసేవాడని అతనికి భార్య ఇద్దరు కుమారులు కలరని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు

Advertisment
తాజా కథనాలు