బడా వర్సెస్ చోటా.. గెలుపెవరిది? కొనసాగుతున్న ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్ర పోటి నెలకొని ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6గంటలకు విజేత ఎవరో తేలిపోనుంది.

New Update
బడా వర్సెస్ చోటా..  గెలుపెవరిది? కొనసాగుతున్న ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ (telugu film chamber of commerce) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపెవరిదన్నదానిపై ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. దిల్‌రాజు (dil raju), సీ.కల్యాణ్(c kalyan) ప్యానల్స్ మధ్య పోటీ జరగుతుండగా.. 1,560 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితం తేలనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు జరుగుతుండగా.. ఈసారి అగ్ర నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా ఛాంబర్‌ ఎన్నికలు జరుగుతుండడం విశేషం.

దిల్ రాజు ఏమంటున్నారంటే?
ఫిల్మ్ ఛాంబర్ గురించి దిల్ రాజు తన విజన్‌ని ఇప్పటికే స్పష్టం చేశారు. తెలుగు సినిమా సోదరభావాన్ని పెంపొందించడంలో సమిష్టి కృషి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తన ప్రధాన లక్ష్యం విమర్శలు చేయడం కాదని.. సినీ పరిశ్రమ మొత్తం బాగుండటమేనని చెప్పారు. కౌన్సిల్ సంక్షేమానికి సహకారం అందించాలని.. కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. తన ప్యానల్ యాక్టివ్ ప్యానల్ అని దిల్ రాజు వివరించారు. చిత్రసీమలో రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించే వారందరూ తమ ప్యానల్ లో ఉన్నారని తెలిపారు. వాణిజ్య మండలిని బలోపేతం చేసేందుకు తాము ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా తాను ఎన్నిక అయితే కిరీటం పెట్టరని.. పైగా తనకు సమస్యలు ఇంకా పెరుగుతాయన్నారు దిల్ రాజు. అయితే.. పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదన్నారు. అటు రాజకీయాలపైనా తన మనసులో మాట బయటపెట్టారు దిల్ రాజు. ఏ పార్టీలో చేరినా ఎంపీగా పోటి చేస్తానని.. అయితే తన ప్రాధాన్యత ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందని స్పష్టం చేశారు ఈ బడా నిర్మాత. ఫిల్మ్ ఛాంబర్‌ను సమర్ధవంతంగా పనిచేసేలా ప్రోత్సహించాలని దిల్‌ రాజు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన మద్దతుదారులు కూడా చెబుతున్నారు.

సీ కల్యాణ్‌ ఏమంటున్నారు?
గిల్డ్‌లో ఉన్న 27 మంది సభ్యులు 1,600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారంటూ ఇటివల సీ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. చిన్న నిర్మాతలను ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుందని..అందుకే చిన్న సినిమాలను బతికించాలంటున్నారు సీ కల్యాణ్. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలని అభిప్రాయపడ్డారు. ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదని ప్రశ్నించారు. ఫిల్మ్ ఛాంబర్‌కు సేవ చేసేవాళ్లు కావాలని.. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారంటూ ఇటివలి కాలంలో దిల్‌ రాజు టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు సీ కల్యాణ్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు