Dil Raju : "ఆ పాటలో మహేష్ బాబు డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి".. పేపర్లు ఎక్కువ తెచ్చుకోండి..!

మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం జనవరి 12 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ నిర్మాత మాట్లాడుతూ.. ఒక మాస్ పాటకు మహేష్, శ్రీలీల డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి అంటూ మరింత ఆసక్తిని పెంచారు.

New Update
Dil Raju : "ఆ పాటలో మహేష్ బాబు డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి".. పేపర్లు ఎక్కువ తెచ్చుకోండి..!

Guntur Kaaram : ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు గుంటూరు కారం(Guntur Kaaram). సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని పై ఎదో ఒక చర్చ వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అంటూ చూస్తున్న మహేష్(Mahesh Babu) అభిమానుల ఎదురు చూపులకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram), మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) గ్రాండ్ గా నిర్వహించింది. సినిమా నైజం, ఉత్తరాంధ్ర హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

publive-image

Also Read: Ariyana Glory: కుర్రకారుకు కిక్కెస్తున్న అరియానా అందాలు.. ఈ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

స్క్రీన్లు చిరిగిపోతాయి

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక కుర్చీ మడతపెట్టి సాంగ్.. ఆ తర్వాత పాటలు కూడా దుమ్ము లేపుతాయని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక మాస్ పాటకు మహేష్ బాబు, శ్రీలీల(Sreeleela) చేసే డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి. అలాగే కొన్ని సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ సీన్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పేపర్లు ఎక్కువ తీసుకెళ్లండి అంటూ సినిమా పై మరింత ఆసక్తిని పెంచారు. పోకిరి సినిమాలో కనిపించే మహేష్ బాబును.. త్రివిక్రమ్ గుంటూరు కారం తో మరో సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు కలెక్షన్ల తాట తీస్తాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దిల్ రాజు.

publive-image

Also Read: Guntur Kaaram Song: “మావ ఎంతైనా”.. గుంటూరు కారం నుంచి మరో దుమ్ము లేపే సాంగ్

Advertisment
తాజా కథనాలు