Digvijay: ఈవీఎంలపై ఎక్స్‌లో దిగ్విజయ్ బాణాలు.. దుమారం రేపుతున్న పోస్టులు..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ అయినట్లు ఆరోపించారు. ఇందుకు సాక్ష్యాలుగా పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్, బీజేపీకి వచ్చిన ఓట్ల లెక్కలను ప్రస్తావించారు.

New Update
Digvijay: ఈవీఎంలపై ఎక్స్‌లో దిగ్విజయ్ బాణాలు.. దుమారం రేపుతున్న పోస్టులు..

Madhya Pradesh Elections: ఈవీఎంలపై మరోసారి ఆరోపణలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఎక్స్ వేదికగా ఆయన వరుసగా పోస్టులు పెడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌, బీజేపీలకి వచ్చిన ఓట్లని సాక్ష్యాలతో సహా పోస్ట్ చేశారాయన. పోస్టల్ బ్యాలెట్‌కి ఈవీఎంలలో ఓటింగ్‌కి మధ్య ఇంత తేడా ఎందుకు ఉందో అర్ధం కావడం లేదన్నారు. ఓట్లు వేసిన జనం ఒకరే అయినప్పుడు.. రెండింటి మధ్య ఇంత తేడా ఎలా వచ్చిందనేదే దిగ్విజయ్ సింగ్ ప్రశ్న.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు దిగ్విజయ్. నిజానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నది స్పష్టం.

ఇప్పటికే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. చిప్‌ ఉన్న ఏ త్రాన్ని అయినా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది అంటున్నారు దిగ్విజయ్. 2003 నుంచే తాను ఈవీఎంల ద్వారా ఓటింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్లు నియంత్రించడాన్ని అనుతిద్దామా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు దిగ్విజయ్. ఇది అన్ని రాజకీయ పార్టీలు పరిష్కరించాల్సిన ప్రాథమిక ప్రశ్న అంటున్నారాయన.

అయితే దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట‌మితో దిక్కుతోచ‌ని స్ధితిలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల‌ను నిందిస్తోంద‌ని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో విజయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదో చెప్పాలంటున్నారు.

Also Read:

సీఎం పదవిపై రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్.. వారికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్..

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం

Advertisment
Advertisment
తాజా కథనాలు