చాలామందికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఏం తిన్నా అరగదు. ఉదయాన్నే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అరుగుదల సమస్య ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా నైట్ తినేవి ఎక్కువగా జీర్ణం అవ్వవు. దీనికి అనేక కారణాలుంటాయి. ప్రస్తుత జీవనశైలిలో లేట్‌నైట్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆఫీస్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడం.. ఫ్రెష్ అవ్వడం.. ఆ తర్వాత తినాల్సి వస్తుండడంతో జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి. వాటిలో పండ్లు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.
మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే 5 పండ్లపై ఓ లుక్కేయండి:
1. యాపిల్స్:
యాపిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా తినే పండ్లలో ఒకటి. యాపిల్స్‌లో పెక్టిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మలబద్ధకం, విరేచనాల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
2. అరటిపండ్లు
విరేచనాలు వచ్చినప్పుడు రెండు అరటిపండ్లు తినమని డాక్టర్ చెబుతుంటారు. ఎందుకంటే కడుపులో అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను అరటిపండ్లు తొలగిస్తాయి. అవి జీర్ణవ్యవస్థను కూడా సెట్ చేయగలవు.
౩. మామిడి పండ్లు
మామిడి పండ్లు తినడానికి రుచిగా ఉంటాయి. మామిడి పండ్లలో ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఆహారం సజావుగా ప్రవహించడానికి సహాయపడతాయి. ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి పండ్లను సలాడ్స్ లేదా పండ్ల రసాలు, స్మూతీలలో యథాతథంగా తినవచ్చు.
4. కివీ
మంచి జీర్ణక్రియకు సహాయపడే మరొక పండు కివి. కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ సాధారణంగా కడుపుకు బరువుగా ఉండే ప్రోటీన్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
5) నేరేడు పండ్లు
నేరేడు పండు చాలా ఆరోగ్యకరమైన పండు. నేరేడు పండ్లలో విటమిన్ సి ఉండటమే కాదు, శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు మృదువైన ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి. మీరు మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోకుండా చూసుకుంటాయి.
ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం లాంటి జీర్ణ సమస్యలు చాలామంది రోజువారీ జీవితంలో భాగం ఐపోయాయి. మీరు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే, పైన చెప్పిన పండ్ల వైపు మొగ్గు చూపడం మంచిది. మీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. సమస్య దీర్ఘకాలికంగా ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ALSO READ: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు!