Ananthapuram: పామిడి వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న సీనియర్ నేత..!

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలను మాట్లాడనివ్వకపోవడంపై వాగ్వాదానికి దిగారు.

New Update
Ananthapuram:  పామిడి వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న సీనియర్ నేత..!

Ananthapuram YCP: ఏపీలో ఎన్నికలు అతి తర్వలో జరగనున్నాయి. గెలుపు లక్ష్యంగా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష్య పార్టీలు వ్యూహాలు రచిస్తోన్నారు. ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు ప్రచారాలంటూ రోడ్డెక్కారు. ఇదిలా ఉండగా పలు చోట్ల సొంత పార్టీలోని వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.

Also Read: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..!

తాజాగా, అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ ఆసరా బహిరంగ సభలో వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆలస్యంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమయాభావం వల్ల ప్రసంగిస్తానని పేర్కొనడంతో వివాదం తలెత్తింది. పామిడి మండలం వైసీపీ సీనియర్ నాయకుడు ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

Also Read: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

మహిళా కార్యక్రమంలో మహిళలను మాట్లాడి నీవ్వకపోవడంపై వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డితో వైసీపీ నాయకులు వీరాంజనేయులు వర్గీయుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వీరాను అక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆసరా సభ వైసీపీలో ఉన్న వర్గ పోరుకు వేదికగా మారింది.

Advertisment
తాజా కథనాలు