/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-8.jpg)
Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయాల్లో వాగ్వివాదం జరిగింది. సహనాన్ని కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు పరస్పర దాడులకు పాల్పడ్డారు. అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.