TDP: నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధిష్టానం ఇద్దరు కలిసి పనిచేయాలని సర్ది చెప్పిన మాజీ మంత్రి ఫరూక్ మాత్రం పట్టించుకోనట్లు తెలుస్తోంది.
Also Read: ముద్రగడ ఒక పెద్ద దరిద్రం.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!
మరోవైపు, అవమానాలు జరిగే చోట ఉండలేనని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పోటీ చేయాలని బ్రహ్మం అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెబల్ గా నామినేషన్ దాఖలు చేసేందుకు భూమ బ్రహ్మానందరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.