రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయి. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా, తగినంత పోషకాలు అందించాలి. సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. ఎండాకాలంలో దోసకాయ తింటే అనేక లాభాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.వేడి వాతావరణంలో శరీరాన్ని లోపల్నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం. హాట్ సీజన్ స్నాక్‌గా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకుంటే వేడిని తగ్గించాలి. గుండె జబ్బులని దూరం చేసుకోవడానికి చాలా మంచిది.
దోసకాయ జీర్ణక్రియకి మంచిది. ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ జీర్ణక్రియని ఈజీ చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దోసకాయ మంచిది. రోజూ సరైన మొత్తంలో దోసకాయ తినడానికి మంచిది.సమ్మర్‌లో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దీన్ని దూరం చేసుకునేందుకు నీరు ఎక్కువగా తాగాలి. అదే విధంగా, దోసకాయని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. దోసకాయ తింటే శరీర వేడి తగ్గి, జీవక్రియ మెరుగవుతుంది.
దోసకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారు కచ్చితంగా వారి ఆహారంలో దోసకాయని యాడ్ చేసుకోవాలి. శరీరంలో సరైన హైడ్రేషన్‌ని నిర్వహించడానికి దోసకాయ చాలా మంచిది.