Kakinada diarrhea: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా

AP: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా అదుపులోకి రాలేదు. 3 రోజుల్లో మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే 50 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైనవారికి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

New Update
Kakinada diarrhea: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా

Kakinada diarrhea: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. 4 రోజులుగా డయేరియా భారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెడుతూ వస్తోంది. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం. ఇప్పటికే 50 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నారు. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కాకినాడ GGH కి తరలించారు. రెండ్రోజుల క్రితం డయేరియాతో మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో గ్రామంలో జిల్లా ఉన్నతాధికారులు పర్యటించారు. మరోసారి వాటర్ శాంపిల్స్ టెస్టులకు అధికారులు పంపారు.

Advertisment
తాజా కథనాలు