Diamond Hunting: కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రాల వేట కొనసాగుతుంది. తొలకరి చినుకులు పడితే చాలు వజ్రాలు తల్లుక్కుమంటాయని ఆశావహులు అన్వేషిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వస్తూ పంటపొలాల్లో డైమండ్స్ కోసం పరితపిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి అక్కడే మకాం వేస్తున్నారు. అదృష్టం వరిస్తే రాత మారుతుందనే ఆశతో హంట్టింగ్ కొనసాగిస్తున్నారు. గతేడాది ఓ రైతుకు రూ. 2 కోట్లు విలువ చేసే వజ్రం లభ్యం అయింది. దొరికిన వజ్రాలను దళారీలు మాత్రం తక్కువ రేటుకు కొంటూ మోసం చేస్తున్నారు.
Also Read: రెమాల్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్..!
ఇదిలా ఉంటే వజ్రాల వేటపై జొన్నగిరి రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు విత్తుకు పనిరాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టినా ఆశావహులు ఏ మాత్రం లెక్కచేయకుండా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..