Medicine Price: షుగర్.. హార్ట్ డిసీజ్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్.. ఆ మందుల ధరలు తగ్గాయి.. 

షుగర్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వం డయాబెటిక్ మందులపై ధరలను తగ్గించింది. గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధ వ్యాధుల తో పాటు మరిన్ని అత్యవసర మందుల ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) తెలిపింది. 

Medicine Price: షుగర్.. హార్ట్ డిసీజ్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్.. ఆ మందుల ధరలు తగ్గాయి.. 
New Update

Medicine Price: హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో బాధపడేవారు ఉపయోగించే 41 అవసరమైన మందులు, 6 ఫార్ములేషన్స్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) నోటిఫికేషన్ ప్రకారం గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు, మల్టీవిటమిన్‌లు, యాంటీబయాటిక్‌ల మందుల ధరలు తగ్గాయి. “ప్రజలకు మేలు జరిగేలా మందుల ధరలను తగ్గించారు. ధర తగ్గింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ, అథారిటీ దానిని అనుసరించింది.” అని సీనియర్ ఎన్‌పిపిఎ అధికారి ఒకరు తెలిపారు.

ఏ వ్యాధుల మందుల ధర తగ్గుతుంది?

  • Medicine Price: 30 డపాగ్లిఫ్లోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ -  ఇది రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీని ధర రూ.16. షెడ్యూల్ చేశారు.  
  • ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలకు వాడే బుడెసోనైడ్, ఫార్మోటెరాల్ ఒక డోస్ ధర రూ.6.62కి తగ్గింది.
  • మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ సమస్య, యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు సహా అనేక ఔషధాల ధరను NPPA తగ్గించింది. 

Also Read: శ్రవణ్‌ కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. 2 గంటల పాటు సినిమా స్టైల్‌లో హైడ్రామా..!

Medicine Price: భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే మధుమేహ మాత్రలు, ఇన్సులిన్ ధరలను తగ్గించడం వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుంది. 

Medicine Price: కొన్ని నెలల క్రితం మందుల ధరల పెంపుపై పుకార్లు వచ్చాయి. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా మందుల ధరలు 12 శాతం పెరిగాయన్న వదంతులు సత్యదూరం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ టోకు ధరల సూచిక ఆధారంగా ధరలను పెంచుతుంది. అయితే 782 మందుల ధరలో మాత్రం ఎలాంటి పెంపుదల లేదు. దాదాపు 54 మందుల ధర ఒక్క పైసా మాత్రమే పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

#medicines-rate #medicines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe