Leaves to Control Diabetes: జీవన శైలి వ్యాధుల్లో తరచుగా కనిపించే సమస్య మధుమేహం. మనం రోజూ తినే ఆహారపు అలవాట్లు ఈ సమస్య పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. మధుమేహ సమస్యను నియంత్రించడానికి మెడికేషన్, డైట్ ఫుడ్స్ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి కెలరీలు, చక్కర శాతం తక్కువగా ఉన్న ఫుడ్స్ మాత్రమే తింటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి మాత్రమే కాదు మీ ఇంట్లోనే దొరికే ఈ సింపుల్ ఆకులు లేదా వాటితో తయారు చేసిన పదార్థాలు తింటే చాలు మీ రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో చురుకుగా పనిచేస్తాయి.
రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడే ఆకులు
అశ్వగంధ ఆకులు
ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ మొక్క చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క ఆకులు టైప్ 2 డయాబెటీస్ సమస్య ఉన్న వాళ్ళ పై మంచి ప్రభావం చూపుతుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి.. చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయపడును.
కరివేపాకు ఆకులు
సహజంగా ఈ ఆకులను మన ఇంట్లో చేసే ప్రతీ వంటకాల్లో వాడుతుంటాము. మధుమేహ సమస్య ఉన్న వారు ఉదయం లేవగానే వీటిని తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ ఉత్త్పతిని మెరుగుపరుచును.
మామిడి ఆకులు
మామిడి ఆకుల్లో పెక్టిన్, విటమిన్ C, ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ సమస్య ఉన్న వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో అధిక కొవ్వు, చక్కర స్థాయిల సమస్యతో బాధపడే వాళ్ళు.. ఈ ఆకులను వేడి నీటిలో మరిగించి తాగితే ఆరోగ్యం పై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
మెంతి ఆకులు
మెంతి ఆకులు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలను కలిగి ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తాయి. వీటి ఆకులు లేదా గింజలను తింటే శరీరంలో లెవెల్స్ తగ్గించడంలో సహాయపడును.
వేప ఆకులు
ఈ ఆకులు తినడానికి చేదుగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యం పై మెరుగ్గా పనిచేస్తాయి. రోజూ వేపాకులతో చేసిన జ్యూస్ లేదా వేపాకులను తింటే అధిక కొవ్వు, అధిక రక్తపోటు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడును.
మధుమేహ సమస్య ఉన్న వారు.. మీ ఆహారంలో ఏదైనా అలవాటు చేసుకునేటప్పుడు వైద్యులను తప్పక సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!