/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Banana-jpg.webp)
Diabetic Can Eat Banana: ప్రస్తుత కాలంలో మధుమేహ(Diabetic) బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, ఒకసారి మధుమేహం బారిన పడిన వారు.. తాము తినే ఆహారం (Food)పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అరటి పండును తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అరటి పండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. కానీ అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు సాధారణంగా అరటిపండ్లను పూర్తిగా నివారించాలని సలహా ఇస్తారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఇది సరికాదని మరికొందరు చెబుతారు. అరటిపండులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఒక వైద్య పరిశోధన ప్రకారం, అరటిపండును మధుమేహం చికిత్సకు సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, అరటి కాండం, పువ్వులు మధుమేహం విషయంలో కూడా కొంత వరకు మేలు చేస్తాయి.
అరటిపండు ఇతర ప్రయోజనాలు..
ఫైబర్: అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు: అరటిపండులో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శక్తికి మంచి మూలం: అరటిపండు శక్తికి మంచి మూలం. ఇది తాజాదనాన్ని, బలాన్ని ఇస్తుంది.
దంతాల ఆరోగ్యం: అరటిపండును తీసుకోవడం వల్ల దంతాలకు కూడా మేలు చేకూరుతుంది. ఇందులో సహజంగా ఉండే ఫైబర్, కాల్షియం దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైన ట్రిప్టోఫాన్ అరటిపండులో ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణ ఆరోగ్యం: అరటి ఫైబర్ కారణంగా అజీర్తి, ఇతర జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మ సంరక్షణ: అరటిపండు మాస్క్‌ని తయారు చేసి చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి.
Also Read:
PV Sindhu meets Amit Shah: అమిత్‌షాతో పాటు కిషన్‌రెడ్డిని కలిసిన బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు!