Dharmana: పీకే బ్రోకర్.. సచివాలయం తాకట్టు పెడితే మీకేంటి? : ధర్మాన కృష్ణదాస్

ప్రశాంత్ కిశోర్ టీడీపీకి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెడితే ప్రతిపక్షాలకు ఎందుకు తలనొప్పి అంటూ ప్రశ్నించారు.

New Update
Dharmana: పీకే బ్రోకర్.. సచివాలయం తాకట్టు పెడితే మీకేంటి? : ధర్మాన కృష్ణదాస్

Dharmana Prasada Rao: ఏపీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కీలకమని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Also Read: రాజకీయాల్లో రోజాది ఐరన్ లెగ్.. సెల్వమణికి వైసీపీతో సంబంధమేంటి..?

ఈ నేపథ్యంలో పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వైసీపీ మంత్రులు, నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ RTVతో మాట్లాడుతూ ఖండించారు. టీడీపీ పార్టీకు పీకే బ్రోకర్ గా పని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలకు ప్రాధాన్యత కొరవడిందన్నారు. 2019 ఎన్నికల ముందు లగడపాటి సర్వే కుడా మైండ్ గేమ్ ఆడించారని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఎటువంటి సర్వే చేయకుండా పీకే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదన్నారు.

Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!

ఈక్రమంలోనే రాష్ట్ర సచివాలయం తాకట్టు విషయంపై స్పందించారు. అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉందని సమర్థించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు చేశారని మండిపడ్డారు. సచివాలయం తాకట్టు పెడితే ప్రతిపక్షాలకు ఎందుకు తలనొప్పి అంటూ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు