Raayan : బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు.. ధనుష్ ఉగ్ర రూపం, ఆసక్తి రేపుతున్న'రాయన్' ట్రైలర్!

ధనుష్ 'రాయన్' మూవీ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ధనుష్ డిఫెరెంట్ మేకోవర్ తో తన నట విశ్వరూపం చూపించాడు. డార్క్ థీమ్ తో ఉండే విజువల్స్, యాక్షన్ సీన్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. AR రెహమాన్ బీజీయం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది.

Raayan : బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు.. ధనుష్ ఉగ్ర రూపం, ఆసక్తి రేపుతున్న'రాయన్' ట్రైలర్!
New Update

Dhanush Raayan Trailer Out : కోలీవుడ్ స్టార్ ధనుష్ లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం 'రాయన్'. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించాడు. ధనుష్ కు ఇది 50 వ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ లో ధనుష్ డిఫెరెంట్ మేకోవర్ తో తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ట్రైలర్ తోనే చెప్పేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. యన్‌ అడవిలో ప్రమాదమైన జంతువేంటో తెలుసా..? అడవిలో బలమైన జంతువు సింహమే.. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు.. అంటూ సెల్వ రాఘవన్‌ డైలాగ్స్‌తో స్టార్ట్ అవుతుంది.

Also Read : ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో వీడియో లీక్.. పొలిటీషియన్స్ తో రామ్ చరణ్ సీన్!

అనంతరం ధనుష్ మాస్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డార్క్ థీమ్ తో ఉండే విజువల్స్, యాక్షన్ సీన్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. AR రెహమాన్ బీజీయం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. అపర్ణ బాలమురళి, దుషారా విజయన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌ ప్లే చేసిన ఈ మూవీని జులై 26 న రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ చివర్లో తెలిపారు మేకర్స్. సన్‌ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

#dhanush #raayan-movie-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe