Raayan : ఆస్కార్‌ లైబ్రరీలో 'రాయన్‌'.. ధనుష్ సినిమాకు అరుదైన గౌరవం..!

ధనుష్ 'రాయన్' సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ లైబ్రరీలో స్క్రీన్‌ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తంచేస్తూ నిర్మాణసంస్థ పోస్ట్‌ పెట్టింది. దీనిపై ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Raayan : ఆస్కార్‌ లైబ్రరీలో 'రాయన్‌'.. ధనుష్ సినిమాకు అరుదైన గౌరవం..!

Dhanush Raayan Movie : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. జులై 26న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ‘రాయన్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్‌ లైబ్రరీలో చేరింది.

ఆస్కార్‌ లైబ్రరీ ఎందుకు ప్రత్యేకం?

ఆస్కార్‌ లైబ్రరీ అనేది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ లైబ్రరీలో చేరడం అంటే ఆ సినిమాకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. గొప్ప స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లేలకు మాత్రమే ఆస్కార్‌ అకాడమీ లెబ్రరీలో చోటు కల్పిస్తారు.


Also Read : బాలీవుడ్ ఆఫర్ ను శ్రీలీల రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

గతేడాది వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ స్క్రిప్ట్‌కు కూడా ఆస్కార్‌ లైబ్రరీలో శాశ్వత స్థానం కల్పించారు. అలాగే తమిళ చిత్రం ‘పార్కింగ్‌’కి కూడా ఈ గౌరవం లభించింది. ఇప్పుడు ధనుష్ 'రాయన్' కు సైతం ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కడం విశేషం. దీనిపై ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్ పిక్షర్స్ నిర్మించిన ఈ సినిమాలో ధనుష్ తో పాటూ సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, యస్.జె. సూర్య ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు