AP: జగన్ రెడ్డి పైశాచికత్వానికి ఇదే నిదర్శనం: దేవినేని ఉమా

జగన్ రెడ్డి రివర్స్ టెండర్ల నిర్ణయాల వల్లే బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

New Update
AP: జగన్ రెడ్డి పైశాచికత్వానికి ఇదే నిదర్శనం: దేవినేని ఉమా

Devinneni Uma: మాజీ సీఎం జగన్ రెడ్డి తప్పుడు, అహంకారపూరిత, మూర్కపు, రివర్స్ టెండర్ల నిర్ణయాల వలనే నేడు బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్లక్ష్యం, తెలివితక్కువ తనం, ఆయన పిచ్చి పనుల వలనే ప్రజలకు ఇంతటి వ్యథ మిగిలిందన్నారు. గతంలో బుడమేరుకు చంద్రబాబు డబ్బులు కేటాయించినా జగన్ పట్టించుకోలేదని.. చంద్రబాబు ఇచ్చిన డబ్బులను ఖర్చు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

బుడమేరు వరద వలన లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండ.. లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఈ కష్టకాలంలో అయినా ప్రజలకు సాయం చేయకపోగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకు వచ్చి ఢీకొట్టిన బోట్లకు వైసీపీ రంగులు కనిపిస్తున్నాయన్నారు. వాటిని తియడానికి నేడు వందల మంది పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..!

గతంలో వైసీపీ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోతే అది పెట్టడానికి గత ప్రభుత్వానికి నాలుగైదేళ్లు పట్టింది. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే పట్టించుకోలేదని.. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే పట్టించుకోలేదని.. పూంచా రిజర్వాయర్ కోట్టుకుపోయినా పట్టించుకోలేదని.. ఇంత జరిగినా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తా ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిందని సిగ్గుగా ఉందన్నారు.

వెలగలేరు గెట్లు ఎత్తి పారిపోయారని చెప్పడం గడ్డితినేవారు మాట్లాడే మాటలేనన్నారు. ఇంత పెద్దఎత్తున వరద వస్తే.. కష్టాల్లో ఉన్న ప్రజలకు అర్థరాత్రి అపరాత్రి అని చూడకుండా వయస్సును కూడా లెక్కబెట్టకుండా ప్రజలకోసం పనిచేస్తుంటే.. కనీస జ్ఞానం లేకుండా విమర్శిస్తారా? వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శకు వెళుతుంటే వరద బాధితులే తరిమి కొడుతున్నారన్నారు. వరద బాధితుల మాటలకు తెల్లబోయి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి తెల్లమొఖం వేసుకు వెళ్లాడన్నారు.

గోదావరికి వరదలు వస్తే కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఇంట్లో నుండి బయటకు రాకుండా పరాదలు కట్టుకుని హెలికాఫ్టర్ లో తిరిగిన జగన్ మళ్లీ విమర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. 2022లో గోదావరికి వరదలు వస్తే పక్క రాష్ట్రాలో ఇచ్చిన వరద సాయం కూడా చేయకపోగా.. కనీసం బాధితులకు మంచినీళ్లు ఆహారం కూడా ఇవ్వలేదన్నారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ రెడ్డి నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికానికి నిదర్శనమన్నారు. చీకటి అని కూడా లెక్క చేయకుండా మంత్రులందరూ బాధ్యతగా తీసుకుని బుడమేరుకు పడిన గండ్లు పూడ్చారన్నారు. బుడమేరు వరద బాధితులకు, రైతాంగానికి జగన్ రెడ్డి క్షమాణ చెప్పాలని.. ఆనాటి పాలనను గుర్తుకు తెచ్చుకుని సిగ్గుతో ముక్కును నేలకు రాయాలన్నారు.

Advertisment
తాజా కథనాలు