Devil Release: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రిలీజ్ ఆరోజే..?

అభిషేక్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా డెవిల్. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 29 రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ తేదీకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

New Update
Devil Release: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రిలీజ్ ఆరోజే..?

Devil Release:కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డెవిల్. తాజాగా ఈ చిత్ర బృంధం సినిమా రిలీజ్ తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 29 ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. మేకర్స్ దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న హై బడ్జెట్ ఫిలిం డెవిల్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

publive-image

పీరియాడిక్ యాక్షన్ త్రిల్లర్ జానర్ లో ఈ కథను రూపొందించారు. పోస్టర్ ఆధారంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కథకు అనుగుణంగా డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. "బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్" అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.

publive-image

ఈ చిత్రంలో మాళవిక నాయర్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. డెవిల్ అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. సినిమాలో హర్షవర్ధన్ బ్యాక్ స్కోర్ మూవీకి హైలెట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.

Also Read: Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు