Devendra Fadnavis: బీజేపీకి బిగ్ షాక్.. దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా! బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఎన్డీయే కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసమే కష్టపడుతానని అన్నారు. By V.J Reddy 05 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Devendra Fadnavis: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఎన్డీయే కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసమే కష్టపడుతానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ స్థానాల్లో గెలవలేదని.. దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తాను రాజీనామా చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాలని కోరారు. ఓటమికి భయపడి పారిపోయే వ్యక్తిని తాను కాదని.. బీజేపీని తిరిగి మెజారిటీ స్థానాల్లో గెలిపించేందుకు కష్టపడుతానని అన్నారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 24 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. 2024లో కేవలం 9 సీట్లకే పరిమితం అయింది. దీంతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి మహా షాక్ ఇచ్చారు. Mumbai: Maharashtra Deputy CM Devendra Fadnavis says, "I take the responsibility for such results in Maharashtra. I was leading the party. I am requesting the BJP high command to relieve me from the responsibility of the government so that I can work hard for the party in… pic.twitter.com/aPfnOWyVa3 — ANI (@ANI) June 5, 2024 #WATCH | Mumbai: Maharashtra Deputy CM Devendra Fadnavis says, "...This debacle that happened in Maharashtra, our seats have reduced, the entire responsibility for this is mine. I accept this responsibility and will try to fulfill whatever is lacking. I am not a person who will… pic.twitter.com/ypJzTTXHf4 — ANI (@ANI) June 5, 2024 #devendra-fadnavis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి