Devara Movie : ప్రీ సేల్స్ లో 'దేవర' హవా.. అప్పుడే అన్ని లక్షల టికెట్లు అమ్ముడయ్యాయా?

ఎన్టీఆర్ 'దేవర' మూవీ ప్రీసేల్‌ లో హవా చాటింది. కేవలం ప్రీ సేల్స్ రూపంలో అప్పుడే 5 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు మూవీ టీమ్‌ చెప్పింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update
Devara Movie : ప్రీ సేల్స్ లో 'దేవర' హవా.. అప్పుడే అన్ని లక్షల టికెట్లు అమ్ముడయ్యాయా?

Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతుంది. అయితే దీని కంటే ముందే ఈ మూవీ ప్రీ సేల్స్ లో అదరగొట్టింది.

దేవర కేవలం ప్రీ సేల్స్ రూపంలో అప్పుడే 5 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు మూవీ టీమ్‌ చెప్పింది. రిలీజ్ కు ఇంకా 20 రోజుల టైమ్ ఉండగానే 5 లక్షల టికెట్స్ సెల్ అయ్యాయంటే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో స్పష్టమవుతోంది.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో ‘దేవర’ ట్రైలర్..!

ఇక దేవర ట్రైలర్ ను సెప్టెంబర్ 10న బిగ్‌స్క్రీన్‌పై లాంచ్‌ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ట్రైలర్‌ 2 నిమిషాల 45 సెకెన్ల నిడివి ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేశారు.

Advertisment
తాజా కథనాలు