Destination Wedding: దేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 38 లక్షల వివాహాలు జరగవచ్చని ఒక అంచనా. ఇటీవల కాలంలో యువత డెస్టినేషన్ మేరేజ్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. దేశంలోనే సుదూర ప్రాంతంలో.. విదేశాల్లో చక్కని డెస్టినేషన్స్ లో పెళ్లి చేసుకోవాలని.. జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలని భావిస్తున్నారు. ఇంటి దగ్గర చేసుకునే వివాహాల కంటే.. ఈ డెస్టినేషన్ మేరేజ్ లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పై చేసే ఖర్చు బాగా పెరుగుతోంది. ఒక పెళ్లి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు ఈ విధానంలో అవుతోంది. ఇటీవల పెరిగిన ఈ ధోరణిపై మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. రేడియో ద్వారా ప్రజలను ప్రధాని పలకరించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్ట్మ్ చేశారు. దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ వీరి ఎంపికగా మారింది.
ఇంటికి దూరంగా అందమైన ప్రదేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే ధోరణి ప్రజల్లో పెరుగుతోందని వివాహ పరిశ్రమతో సంబంధం ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్(Destination Wedding) లో స్వదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. విదేశాలలో వివాహం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల హాట్ స్పాట్ లుగా భావించే రాజస్థాన్, గోవా, మహాబలిపురం, కేరళ, ముంబైలలో ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు కేవలం 10 శాతం మంది మాత్రమే ఉన్నారు.
పెళ్లి కోసం కోట్లు ఖర్చు
ఆన్లైన్ వెడ్డింగ్ వెండర్ డైరెక్టరీ 2021, 2022 సంవత్సరాలకు తన నివేదికలో పెళ్లిళ్ల ఖర్చు సగటున రూ .10 నుంచి 15 లక్షలు పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది సగటు రూ.18 లక్షలకు చేరువలో ఇది ఉండవచ్చు. ఈ సంవత్సరం దేశంలో టాప్ డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) కేంద్రాలుగా డెహ్రాడూన్, గోవా - జైపూర్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డెస్టినేషన్ కోసం కనీసంగా రూ.20 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ప్రజలు ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో పెళ్లి వేడుక జరిగితే ఖర్చులు కోట్లలో ఉంటాయి.
Also Read: ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది
పెళ్లి చేసుకుంటే ఉపాధి దొరుకుతుంది.
వెడ్డింగ్ ప్లానర్స్ రిపోర్ట్స్ ప్రకారం విదేశాల్లో ప్రతి సంవత్సరం 5,000 వివాహాలు జరుగుతాయి, దీనికి సుమారు రూ .50,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది దేశంలో 38 లక్షల వివాహాలు జరిగొచ్చనీ, వీటి ద్వారా రూ.4.7 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. అటువంటి పరిస్థితిలో, డెస్టినేషన్ వెండింగ్ బదులుగా పెళ్లిళ్లు భారతదేశంలో జరిగితే, వివాహ ఖర్చు మొత్తం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. ఇది దేశ వ్యాపార, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలకు శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయి.
హాట్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే
దుబాయ్, మస్కట్, సింగపూర్, థాయ్ లాండ్, ఇండోనేషియా, మాల్టా, మలేషియా దేశాల్లో వెడ్డింగ్ డెడెస్టినేషన్స్(Destination Wedding) గా ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక వివాహాలు రాజస్థాన్, గోవా, మహాబలిపురం, కేరళ, షిర్డీ, నాసిక్, ద్వారకా, సూరత్, బరోడా, నాగ్పూర్, ఓర్చా, గ్వాలియర్, ఉదయ్పూర్, జైసల్మేర్, పుష్కర్, జైపూర్, ముంబైలలో జరుగుతున్నాయి. వాటిలో వారణాసి, మథుర, బృందావన్ కూడా హాట్ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా మారాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సెలబ్రిటీలు..
తాజాగా మెగా వారసుడు వరుణ్ తేజ్.. నటి లావణ్య త్రిపాఠి ఇటలీలో జరిగింది. ఇక విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ కూడా ఇటలీలో వివాహం చేసుకోగా, కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా అలాగే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ భారతదేశంలోని వారి ఇంటి నుంచి దూరంగా వివాహం చేసుకున్నారు. కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల డెస్టినేషన్ వెండింగ్ సవాయ్ మాధోపూర్ లోని బర్వారా ఫోర్ట్ లో, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహం జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో జరిగింది.
Watch this interesting Video: