Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను పలు అంశాలపై తొలి రివ్యూలోనే నిలదీశారు. సీజనల్ వ్యాధులపై అధికారులను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలోనే 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదని నిలదీశారు.
Also Read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్ స్వీట్ వార్నింగ్..!
స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను CFMS ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే.. తాగునీటి సరఫరాలో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు వస్తున్నాయన్న పవన్.. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.