Bhatti Vikramarka: ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడు కేటీఆర్..డిప్యూటీ సీఎం వార్నింగ్..!

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..ఎమ్మెల్యే కేటీఆర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వెంట్రుక పీకలేరని కేటీఆర్ మాట్లాడడం అదేం భాష అని ప్రశ్నించారు. చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడటం దిగజారుతనానికి నిదర్శనమన్నారు. భాష, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.

New Update
Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

Bhatti Vikramarka:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడుతే బాగుంటుందన్నారు.వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ మాట్లాడడం అదేం భాష అని ప్రశ్నించారు. చదువుకున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం దిగజారుతనానికి నిదర్శనమన్నారు.

అటు ఏప్రిల్ 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మేం చేసిన, చేపట్టనున్న విషయాలను ఏప్రిల్ 6 న ప్రజలకు భారీ బహిరంగ సభ ద్వారా వివరిస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచే వ్యూహంపై చర్చించాన్న భట్టి...కాంగ్రెస్ మేనిఫెస్టో ఏప్రిల్ 6 న విడుదల చేస్తామని వెల్లడించారు. వంద రోజుల ప్రభుత్వ పాలనపై చర్చించామని..తెలంగాణ ను ఒక మోడల్ గా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తుక్కుగూడ సభ నాందిగా భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లాగా మేం పాలన గాలికి వదిలేయలేదన్న డిప్యూటీ సీఎం..వ్యవసాయశాఖ మంత్రి 24 గంటలు రైతులతో మాట్లాడుతూ ఉన్నారన్నారు. మీలాగా మేం ఇళ్ల నుండి బయటకి రాకుండా సోషల్ మీడియాకి పరిమితం కావడం లేదని కేటీఆర్ కు చురకలంటించారు.

ఇది కూడా చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు