మీరు డిప్రెషన్ లో ఉన్నారా..అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి! ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. ఇది మానసిక వ్యాధి అన్న విషయం మనకు తెలిసిందే.అయితే డిప్రెషణ్ లక్షణాలు ఎలా వుంటాయ్, డిప్రెషన్‌ను తట్టుకోవాలంటే ఏమి చేయాలి, డిప్రెషన్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రముఖ వైద్యులు ఇచ్చిన సూచనలను మీకు అందిస్తున్నాం. By Durga Rao 25 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. ఇది మానసిక వ్యాధి అన్న విషయం మనకు తెలిసిందే. మానసిక వ్యాధుల గురించి, మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది ఈ మధ్యనే తెలుసుకోవడం ప్రారభించారు. ఒకప్పుడు పేషంట్లు లేక ఖాలీగా వున్న సైకాలజీ సెంటర్లు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా నిండిపోయాయంటే ఆశ్చర్యానికి గురికావసిందే. కరోనా తరువాత ఇలాంటి మానసిక సమస్యలు చాలా పెరిగిపోయాయ్. రోజును ఆహ్లాదకంగా ప్రారంభించాలి. డిప్రెషన్ పోవడానికి ఇది మొదటి చిట్కా. ఉదయం కనీసం 6 గంటలకు నిద్రలేని ఫ్రెష్ అయిన తరువాత కొద్దిగా వ్యాయామం చేసుకోవాలి. తప్పుకుండా టిఫిన్ చేయాలి. తమకు ఏదైనా బాధలు, కష్టాలు వుంటే ఇతరులతో పంచుకోవాలి. మంచి డైట్ డిప్రెషన్ దూరం కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డిప్రెషన్ విపరీతంగా వున్నప్పుడు భోజనం చేయాలని అనిపించదు. నచ్చిన వంటకం ముందు పెట్టినా తినకుండా అలాగే వుంటారు. అలా చేయకుండా పోషకాలు మెండుగా వున్న ఆహారాన్ని, ముఖ్యంగా కూరగాయలు, పళ్లను ఎక్కువగా తినాలి. వీటి నుంచి కావలసిన్ని వైటమిన్లు అందుతాయ్. మద్యం, పొగ అలవాటుకు స్వస్తి డిప్రెషన్‌కు గురైన వారిలో పొగ, మద్యం తాగే అలవాటు ఎక్కువగా వున్నవారు వాటిని ఆపివేయాలి. వీటితో పాటు ఏ మత్తు పదార్థాల వల్ల కూడా తమ సమస్యలు పరిష్కారం కావని డిప్రెషన్‌కు గురైన వారు భావించాలి.ఆత్మహత్య ఆలోచన డిప్రెషన్ మొదటి దశలో ఆత్మహత్య ఆలోచనలు రావు, కానీ రెండో దశలో డిప్రెషన్ తీవ్రత పెరిగిన తరువాత ఆత్మహత్య ఆలోచనలు చాలా వస్తాయ్. ఇలాంటి పరిస్థితిలో వెంటనే బయటకు వచ్చి అందరితో మాట్లాడటం ప్రారంభించాలి. స్నేహితులు, బంధువులతో మాట్లాడుతూ వుండాలి. సమస్యలను చెప్పుకుంటూ వుండాలి. ఆత్మహత్య ఆలోచన అలాగే వుంటే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలి. ప్రకృతితో కలిసి స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, ఆకాశం, మట్ట వాసన, చెట్లు, పంటలు, లాంటి సహజమైన ప్రకృతిలో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. ప్రకృతిలో గడపడం వల్ల మాసనిక సమస్యలు చాలా తగ్గుతాయని పరిశోధనలో తేలింది. #depression మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి