Uttarakhand Tunnel: లేనివి ఉన్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా.. టన్నల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది!

సొరంగంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్ కార్మికుల్లో నిస్పృహ, గందరగోళం, కంగారు పెరుగుతోంది. సమయం గడుస్తున్నకొద్దీ కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. లేనివి చూస్తున్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Uttarakhand Tunnel: లేనివి ఉన్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా.. టన్నల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది!
New Update

ఉత్తరకాశి(Uttarakasi)లో సొరంగం(Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయి 13 రోజులు గడవడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాక కార్మికుల ఆరోగ్యం కోసం ఏం చేయాలి? వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి? వంటి అంశాలను మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సొరంగంలో చాలాకాలం పాటు చిక్కుకొని బయటకొచ్చిన వారిలో నిస్పృహ, గందరగోళం, కంగారు వంటివి ఉంటాయని.. అందుకే వారి మానసిక స్థితిని పూర్తిగా తెలుసుకొని తగిన చికిత్సను అందించాలన్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో వచ్చే మానసిక సమస్యల్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

publive-image టన్నల్ లో చిక్కుకున్న కార్మికుడు

మానసిక గందరగోళం ఎంతో ప్రమాదం:

సొరంగాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో చూడటం, వాసన, వినికిడి వంటి ఇంద్రియ జ్ఞానం తగ్గిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారని తెలిపారు. మొదట బెంగ పెట్టుకుంటారు. సమయం గడుస్తున్నకొద్దీ చింత పెరుగుతుంది. కనీసం వారిలో వారు మాట్లాడుకోవడం కెమెరాల్లో కనిపించింది. ఇది మంచి విషయమని.. ఆందోళన, నిరాశ కంటే కూడా మనిషిలో పుట్టే మానసిక గందరగోళం మరింత తీవ్రమైనదన్నారు. సొరంగంలో ఉన్నవారిలో ప్రస్తుతం ఇలాంటి మానసిక గందరగోళమే ఏర్పడి ఉంటుందన్నారు. అక్కడ అసలు లేనివి చూస్తున్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురవుతారని.. తమ ఇంట్లోవారు లేదా స్నేహితులు పిలుస్తున్నట్లుగా వారికి అనిపిస్తుందని.. తమ ప్రియమైన వారి గొంతు వినిపిస్తున్నట్లుగా ఉంటుందని... మెదడులో భయం కలిగించే ఆకారాలు, ధ్వనులు ప్రతిధ్వనిస్తుంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.

publive-image టన్నల్

సమయం గడుస్తున్నకొద్దీ కార్మికుల్లో టెన్షన్:

సొరంగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న అంశంపై మాట్లాడుతూ... సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే లక్షణం కనిపిస్తుందని వైద్య నిపుణలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో వారు గతంలోకి వెళ్తుంటారని.. అందరి మధ్యా ఉన్నప్పటికీ, సొరంగంలో చిక్కుకుపోయిన అనుభూతికి లోనవుతారని.. వారు అలాంటి స్థితిని అనుభవించడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు తీవ్రమైన యాంగ్జైటీకి గురవుతారని చెప్పారు. అయితే, వారు బయటకు తీసుకువచ్చిన వెంటనే మానసిక చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఒత్తిడి తగ్గడానికి మందులు ఇవ్వాల్సిన అవసరం రావొచ్చనన్నారు. ఆందోళన తగ్గి నిద్ర పట్టడానికి సహాయపడే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.



తగ్గిపోతున్న శరీర ఉష్ణోగ్రత:

లోపల ఉన్నకార్మికులకు ఇప్పటికే బీపీ లేదా షుగర్‌ వంటి ఏదో ఒక వ్యాధి ఉన్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం మందులు తీసుకోకపోవడం వల్ల ఆ వ్యాధులతో వచ్చే ఇబ్బందులు పెరుగుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుందన్నారు. నీరు తాగకపోవడంతో మైకం రావడం, మూత్రవిసర్జన తగ్గడంతో కిడ్నీలు పాడవుతాయని... ఆహారం లేకపోవడంతో శరీరం బలహీనపడుతుందన్నారు. లోపల చిక్కుకున్నవారితో కుటుంబీకులు, బయట ఉన్నవారు మాట్లాడుతుండటం చాలా ముఖ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యల గురించి వారికి చెబుతుండాలన్నారు. చలి కారణంగా కార్మికుల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందని.. ఆక్సీజన్ కొరత వల్ల ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయని.. శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఇది గుండెపై ప్రభావం చూపొచ్చని.. ఈ కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు ప్రభావితం అవుతాయని, రక్త ప్రసరణ తగ్గిపోతే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది మానసిక నిపుణులు చెప్పారు.

Also Read: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!

WATCH:

#uttarakhand
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe