Dengue: ఇలా చేస్తే దెబ్బకు డెంగీ పరార్‌.. ఈ చిట్కాలతో దోమలకు దబిడి దిబిడే..!

డెంగీ బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అసలు ఈ వ్యాధి తెచ్చుకోకుండా ఉండడం ముఖ్యం. కొన్ని చిట్కాలు పాటిస్తే డెంగీ సోకకుండా ఉండవచ్చు. మీ ఇంటికి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలు ఉండేలా చూసుకోండి. దోమల వృద్ధి ప్రదేశాలను నిర్మూలించండి. బెడ్ నెట్స్ ఉపయోగించండి.

Dengue: ఇలా చేస్తే దెబ్బకు డెంగీ పరార్‌.. ఈ చిట్కాలతో దోమలకు దబిడి దిబిడే..!
New Update

ఈ మధ్య కాలంలో డెంగీ(Dengue) బారిన పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సామాన్యులు, సెలబ్రెటీలు..ఇలా ప్రతి ఒక్కరిని డెంగీ దోమ కుడుతుంది. ఎందుకంటే డెంగీ దోమలకు ఎలాంటి భేద భావాలూ ఉండవు. డెంగీ సోకిందంటే ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. ఇది మన బాడీని చాలీ వీక్‌ చేసేస్తుంది.డెంగీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా సోకిన ఆడ ఈడెస్ దోమలు, ముఖ్యంగా ఈడిస్ ఈజిప్టి కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య.

డెంగీ అధిక జ్వరాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పి, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా దోమ కుట్టిన 4-10 రోజుల తర్వాత కనిపిస్తాయి. డెంగీ వైరస్‌లో నాలుగు విభిన్న సెరోటైప్‌లు ఉన్నాయి (DEN-1, DEN-2, DEN-3, DEN-4). ఒక సెరోటైప్‌తో ఇన్ఫెక్షన్ ఇతరులకు రోగనిరోధక శక్తిని అందించదు. నిజానికి వివిధ సెరోటైప్‌లతో వచ్చే ఇన్ఫెక్షన్‌లు తీవ్రమైన డెంగీ ప్రమాదాన్ని పెంచుతాయి. దీన్నీ డెంగీ హెమరేజిక్ ఫీవర్ లేదా డెంగీ షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇక డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే కంటే అసలు అది రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డెంగీ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించండి.

• దోమల వృద్ధి ప్రదేశాలను నిర్మూలించండి: డెంగీను వ్యాపింపజేసే దోమలు నిలువ ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. బకెట్లు, పూల కుండలు, నీటిని సేకరించే కంటైనర్‌లను క్రమం తప్పకుండా ఎంప్టీ చేయండి. లేకపోతే కవర్ చేయండి.

• దోమల రిపెల్లెంట్‌: మన బట్టలు.. వీలైతే కొంచెం శరీర భాగాలపై దోమల రిపెల్లెంట్‌ని వినియోగించవచ్చు. ఇది మనం కొనే ప్రొడెక్ట్ బట్టి ఉంటుంది. డాక్టర్‌ సూచనను పాటించి ప్రొసిడ్‌ అవ్వండి.

• దుస్తులు: మనం వేసుకునే బట్టలు మనల్ని దోమల బారి నుంచి కాపాడగలవని తెలుసా. ఆరుబయట ఉన్నప్పుడు ఫుల్‌ స్లీవ్‌ ఉన్న షర్ట్స్‌, ఫుల్‌ ప్యాంట్‌లు, సాక్స్‌లు, బూట్లు ధరిస్తే దోమల మన జోలికి వచ్చినా కుట్టకుండా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది.

• బెడ్ నెట్స్ ఉపయోగించండి: దోమతెరల కింద పడుకోండి. ప్రత్యేకించి మీరు డెంగీ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే లేదా ప్రయాణిస్తున్నట్లయితే ఇది కచ్చితంగా పాటించండి.

• దోమలు బయట ఎక్కువగా ఉండే సమయంలో ఇంట్లోనే ఉండండి: డెంగీను వ్యాపింపజేసే ఏడిస్ దోమలు తెల్లవారుజామున, మధ్యాహ్నం సమయంలో చాలా చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి.

• తలుపులు, కిటికీలను క్లోజ్‌ చేయండి: మీ ఇంటికి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలు ఉండేలా చూసుకోండి.

• తక్షణమే వైద్య సంరక్షణ పొందండి: మీకు తీవ్ర జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పులు, దద్దుర్లు వంటి డెంగీ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ప్రారంభంలోనే ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

డెంగీ ఒక తీవ్రమైన వ్యాధి అని గుర్తుంచుకోండి. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాని వ్యాప్తి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందే..ఇది మర్చిపోవద్దు.

ALSO READ: అదే పనిగా కంప్యూటర్‌ ముందు కూర్చోని వర్క్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

#dengue #dengue-prevention
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe