కుత్బుల్లాపూర్‌లో కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకున్న స్థానికులు

కుత్బుల్లాపూర్‌లో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దేవేందర్‌ నగర్‌, కైసర్ నగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లు కూల్చేస్తే చచ్చిపోతామంటూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు.

New Update
కుత్బుల్లాపూర్‌లో కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకున్న స్థానికులు

కుత్బుల్లాపూర్‌లో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మొపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని రోడ్లు, చెరువులు, భూములు తదితర ప్రాంతాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తున్నారు. ఈ రోజు ఉదయమే జేసీబీలను తీసుకుని కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లిన రెవిన్యూ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో ఎన్నికలు వాయిదా!?

ఈ మేరకు దేవేందర్‌ నగర్‌, కైసర్ నగర్‌, బాలయ్య బస్తీలో అక్రమంగా నిర్మించిన చాలా ఇండ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పిల్లపాపలతో కాలనీలోని రొడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. జేసీబీలను అడ్డుకున్నారు.  కొంతమంది తమ ఇళ్లు కూల్చేస్తే చచ్చిపోతామంటూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు