Ananthapur: అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఔట్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అనధికార లేఔట్లను అమ్మడం చట్టరీత్యా నేరమని అలా చేసిన వారికి శిక్ష ఉంటుందని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూముల్లో రోడ్లు వేసుకుంటూ ఫ్లాట్లుగా విడగొట్టారని.. వాటిని అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.. లేదంటే ఇలా జరుగుతుంది: సిఐ రాజేష్
దీనివల్ల ప్రభుత్వానికి భారీ గండి పడుతుందన్నారు. అనధికార లేఔట్లలో ప్లాట్లు కొన్న వారు కూడా నష్టపోతారని పైగా అధికారులు తీసుకుపోయే చర్యలకు బాధ్యులవుతారని కమిషనర్ హెచ్చరించారు. మున్సిపల్ అనుమతులు పొందిన ప్లాట్ లో మాత్రమే ప్రజలు లేఔట్లు కొనుగోలు చేయాలని సూచించారు.