/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/lawyers-jpg.webp)
Tirupati: ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని తిరుపతి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు గత 30 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అడ్వకేట్ల నిరసనలకు విపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు చేస్తున్నారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల!
భూహక్కు చట్టం వలన రైతులు, భూ యజమానులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజలకు న్యాయబద్దంగా వచ్చే ఆస్థి హక్కును కోల్పోతారని వివరిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్వకేట్లు తిరుపతి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్షలు 31రోజుకు చేరింది. అయినప్పట్టికి ప్రభుత్వం పట్టింకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. భూహక్కు చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు.. వైసీపీని వీడిన పార్టీ శ్రేణులు..!