Luxury Homes: మన దేశంలో ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో 2022 కంటే గతేడాది లగ్జరీ ఇళ్ల సంఖ్య దాదాపు 90శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE తన తాజా రిపోర్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లగ్జరీ అంటే విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి సంపన్న వర్గాల వ్యక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని రిపోర్ట్ చెబుతోంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నాలుగు కోట్ల రూపాయలు లెదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు 2023లో 75% అధికంగా జరిగాయి. హైదరాబాద్ లో 2023లో 2,030 లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. అదే 2022లో వీటి సంఖ్య 1,240 యూనిట్స్ గా ఉన్నాయి.
ఇక దేశవ్యాప్తంగా హైదరాబాద్ తో బాటు ఏడూ ప్రధాన నగరాల్లో 2023లో 12,935 విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు (4 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ధర) జరిగాయి. అదే 2022లో ఈ ఇళ్ల సంఖ్య 7,395 మాత్రమే. భవిష్యత్ లో కూడా విలాసవంతమైన గృహాల అమ్మకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ చెప్పారు.
Also Read: వాలెంటైన్స్ డే.. గులాబీల ఎగుమతిలో రికార్డ్..
నగరాల వారీగా విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఇలా..
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 2023 లో 5,530 విలాసవంతమైన ఇళ్ల (Luxury Homes)అమ్మకాలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 1,860 మాత్రమే. ముంబయి లో 2022లో 3,390 ఇళ్ల అమ్మకాలు జరగగా 2023లో 4,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణే విషయానికి వస్తే అక్కడ ముందు సంవత్సరం 300 యూనిట్ల లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది 310 సేల్ అయ్యాయి. చెన్నై, కోల్‌కతాలో కూడా స్వల్పంగా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. బెంగళూరులో మార్పులేదు. ఇక అన్ని కేతాటిరీల్లోనూ ఇళ్ల అమ్మకాల విషయానికి వస్తే దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2023లో 3,22,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది 2022 కంటే 9 శాతం ఎక్కువ.
Watch this Interesting Video: