/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T100917.891.jpg)
Dell: అమెరికాకు చెందిన టెక్ కంపెనీ డెల్ మరో సారి ఉద్యోగాలకు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. టెక్ పరిశ్రమలో AI ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఉద్యోగాల తొలగింపుపై డెల్ స్పష్టత ఇవ్వకపోగా.. దాదాపు 12,500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడబోతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మార్కెట్ డిమాండ్లకు తగ్గట్లుగా..
ఈ ఉద్యోగుల తొలగింపు మార్కెటింగ్ పై తీవ్ర ప్రభావం చూపనున్నప్పటికీ.. మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా సేవలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు డెల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఈ మార్పులు వ్యక్తులు, మా బృందాలపై ప్రభావం చూపుతాయని తెలుసు. కాబట్టి మేము దీన్ని అంత తేలికగా తీసుకోం. డెల్ పునర్నిర్మాణంలో AI-ఆప్టిమైజ్ చేయబడిన సర్వర్‌లు, డేటా సెంటర్ సొల్యూషన్‌లను మెరుగుపరచడమే లక్ష్యంగా కొత్త AI-ఫోకస్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక 2023లో శ్రామికశక్తి తగ్గిపోయిందని, డెల్ 13,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. 2023లో దాదాపు 2,000 టెక్ కంపెనీలు 260,000 మంది ఉద్యోగులను తొలగించగా 2024లోనూ అనేక పెద్ద కంపెనీలు మరిన్ని ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం