Chiken: హైకోర్టులో బటర్ చికెన్ పంచాయితీ.. న్యాయపోరాటానికి దిగిన రెస్టారెంట్లు

ఢిల్లీలో బాగా పేరుగాంచిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల పంచాయితీ హైకోర్టు వరకూ చేరింది. బటర్ చికెన్, దాల్ మఖ్నీ వంటకాలు తామే మొదట తయారు చేశామంటూ యజమానులు న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై తుది విచారణ మే 29న జరగనుంది.

New Update
Chiken: హైకోర్టులో బటర్ చికెన్ పంచాయితీ.. న్యాయపోరాటానికి దిగిన రెస్టారెంట్లు

Delhi: దేశ రాజధాని ఢిల్లోలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర పంచయితీ హైకోర్టు వరకూ చేరింది. ఢిల్లీలోని రెండు పేరుగాంచిన రెస్టారెంట్ ల యజమానులు బటర్ చికెన్ తయారీ విషయంలో కొంతకాలంగా పోట్లాడుతున్నారు. మొదటగా తామే ఈ వంటకాన్ని తయారు చేశామని, ఈ ఘనత తమకే దక్కాలంటూ పోటాపోటీగా న్యాయపోరాటం చేస్తున్నారు.

మోతీ మహల్- దర్యాగంజ్..
ఇక అసలు విషయానికొస్తే.. బటర్ చికెన్, దాల్ మఖ్నీ వంటకాల కోసం మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు ఫైట్ చేస్తున్నాయి. రెండు రెస్టారెంట్లు బటర్ చికెన్, దాల్ మఖ్కీని తామే మొదట కనిపెట్టినట్లు కొన్నాళ్లుగా ప్రకటించుకుంటున్నాయి. అంతేకాదు ఈ ఫుడ్ కోసం న్యాయపోరాటానికి దిగాయి. బార్ అండ్ బెంచ్ ప్రకారం.. దర్యాగంజ్ రెస్టారెంట్ యజమానులు 'ఇన్వెంటర్స్ ఆఫ్ బటర్ చికెన్ అండ్ దాల్ మఖానీ' అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించినందుకు మోతీ మహల్ యజమానులు న్యాయపోరాటం మొదలుపెట్టారు. బటర్ చికెన్ తామో మొదట తయారు చేశామని, దర్యాగంజ్ రెస్టారెంట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మోతీమహల్ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Chiru: మళ్లీ ఒక్కటైన మిత్రులు.. చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత ఆ రచయితకే!

మేమే.. కాదు మేమే..
 మోతీ మహల్ వ్యవస్థాపకుడు కుందన్ లాల్ గుజ్రాల్ తామే మొదట కనిపెట్టినట్లు కోర్టుకు తెలిపారు. అమ్ముడుకాని తందూరీ చికెన్ కి కొన్ని మసాలాలు, సాస్ కలిపి బటర్ చికెన్ చేసినట్లు స్పష్టం చేసింది. మరోవైపు తమ పూర్వీకుడు కుందన్ లాల్ జగ్గీ బటర్ చికెన్ ను కనిపెట్టినట్లు దర్యాగంజ్ తెలిపింది. మోతీమహల్ రెస్టారెంట్ పాక్ లోని పెషావర్ లో కుందన్ లాల్ గుజ్రాల్, కుందన్ లాల్ జగ్గీల మధ్య జాయింట్ వెంచర్ గా ఉందని దర్యాగంజ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే దీనిపై జనవరి 16న విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. నెలలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని దర్యాగంజ్ రెస్టారెంట్ కు ఆదేశించింది. తదుపరి విచారణ మే 29న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు