ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపడింది. తాజాగా వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 59గా నమోదైనట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇదే అత్యుత్తమ వాయు నాణ్యత సూచీ అని పేర్కొంది. అంతకు ముందు ఈ ఏడాది జూలై 9న అత్యుత్తమ వాయు నాణ్యత సూచీ 64 గా నమోదైనట్టు అధికారులు తెలిపారు
ఏక్యూఐ అనేది సున్నా నుంచి 50 మధ్య ఉంటే ఉత్తమ వాయు నాణ్యతగా గుర్తిస్తారని అధికారులు చెప్పారు. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికర స్థాయి, 101 నుంచి 200 మధ్య ఉంటే మితమైనది, 201 నుంచి 300 వరకు ఉంటే తక్కువ స్థాయి, 301 నుంచి 400 పేలవమైన స్థాయి, 401 నుంచి 500 వరకు ప్రమాదకరమైన స్థాయి అని పేర్కొన్నారు.
ఇటీవల వర్షాలు, బలమైన గాలుల వల్ల కాలుష్యం స్థాయి చాలా వరకు తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి మాట్లాడుతూ... ఇటీవల భారీ వర్షాలు, బలమైన గాలులకు వాతావరణంలోని కాలుష్య పదార్థాలు చెదిరి పోయాయని వివరించారు.
ఢిల్లీలో ఈ రోజు ఉష్ణోగ్రత 31.6 డిగ్రీ సెల్సియస్ గా నమోదైనట్టు వివరించారు. కనిష్ట ఉష్ణోగత్ర 25 డిగ్రీ సెల్సియస్ నమోందైందన్నారు. గడిచిన 24 గంటల్లో 15 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆకాశం మేఘావృతం అవుతుందని, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.