Rain in Delhi: ఢిల్లీలో గురువారం అర్థరాత్రి నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఎనిమిది రోజుల తర్వాత, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 కంటే తక్కువ నమోదైంది. అంతకుముందు నవంబర్ 2న ఢిల్లీలో ఏక్యూఐ 346గా ఉంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, శుక్రవారం (నవంబర్ 10) ఉదయం 9:30 గంటలకు, ఢిల్లీలోని ముండ్కాలో 353, IGI విమానాశ్రయంలో 331, ITO బస్టాండ్‌లో 397, జహంగీర్‌పురిలో 395 - లోధి రోడ్ వద్ద 345 వద్ద AQI నమోదైంది.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో ఏక్యూఐ 375 నమోదైంది. వర్షం కారణంగా పొగమంచు కూడా తొలగిపోయింది. అయితే, AQI తక్కువగా ఉన్నప్పటికీ, ఢిల్లీ గాలి ప్రమాదకరంగా ఉంది. AQI 301 - 500 మధ్య ఆరోగ్యానికి చాలా చెడ్డదిగా పరిగణిస్తారు.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై (Delhi Air Pollution) ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బేసి-సరి లాభాలు ఇందులో వివరించారు. నవంబర్ 7న విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు బేసి-సరి బూటకమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.
బేసి-సరి విధానంలో ఇంధన వినియోగం 15% తగ్గింది.
ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్‌లో ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) అధ్యయనాన్నిఉదహరించింది. సరి-బేసి విధానం అమలులో రోడ్లపై ప్రైవేట్ కార్ల సంఖ్య 30 శాతం తగ్గిందని చెప్పారు. ఇంధన వినియోగంలో 15 శాతం క్షీణత నమోదైంది. అలాగే ప్రజా రవాణా వినియోగం కూడా పెరిగింది అని పేర్కొంది.
దీపావళి మరుసటి రోజు అంటే నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు బేసి-బేసిని అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 6న తెలిపింది. అయితే మరుసటి రోజే దీనిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏదో ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సరి-బేసి కాలుష్యాన్ని తగ్గించదు అని కోర్టు అభిప్రాయపడింది.
Also Read: Delhi: కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో కృత్రిమ వాన.. ఎంత ఖర్చు అవుతుందంటే..
సుప్రీంకోర్టు సూచనల మేరకు ఢిల్లీ ప్రభుత్వం వెంటనే సరి-బేసి అమలు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. సరి-బేసి విధానం ఎంత ప్రభావవంతంగా ఉందో సుప్రీంకోర్టు సమీక్షిస్తుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ నవంబర్ 8న తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు అందిన తర్వాత దీన్ని అమలు చేయనున్నారు.
వర్షం ప్రభావం తగ్గితే కృత్రిమ వర్షం..
ఢిల్లీలో ఇప్పుడు కురుస్తున్న వర్షం(Delhi Rains) ప్రభావం తగ్గితే కృత్రిమ వర్షం కురిపించే అవకాశం ఉందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం (నవంబర్ 10) తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి, కేజ్రీవాల్ ప్రభుత్వం నవంబర్ 21-22 తేదీలలో మొదటిసారిగా ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం ప్రణాళికను సిద్ధం చేసింది.
ఇందుకోసం నవంబర్ 8న పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. 40% మేఘావృతం లేదా తేమ ఉన్నప్పుడు కృత్రిమ వర్షం కురిపించవచ్చని చెప్పారు. నవంబర్ 21-22 తేదీలలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కృత్రిమ వర్షాలకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది..
కృత్రిమ వర్షం కురిపించే మొత్తం ఖర్చును కేజ్రీవాల్ (Kejriwal) ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు గురువారం (నవంబర్ 9) తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం సమర్థిస్తే నవంబర్ 20లోగా తొలి కృత్రిమ వర్షం కురిపించవచ్చు.
అయితే, కృత్రిమ వర్షం (Artificial Rains) ప్రభావం రెండు వారాల పాటు మాత్రమే ఉంటుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ నిన్న తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది ఒక స్థిరమైన మార్గం కాదని ఆయన అన్నారు.
Watch this Interesting Video: