ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ రాజకీయాలు హాట్‌హాటుగా సాగుతున్నాయి. ఈ కేసులో కేసీఆర్ కుమార్తే కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడం.. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఏడు రోజుల కస్టడీకి అనుమతివ్వడం చకాచకా జరిగిపోయాయి. కవిత అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. ఇదంతా కుట్రలో భాగమని ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు కేటీఆర్, హరీశ్‌రావు. కవితను పరామర్శించారు. సా.6 గంటలకు కవితను కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
రూ.100కోట్లపై ప్రశ్నలు:
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది కోర్టు. రేపు(మార్చి 18)ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కవితను ఈడీ విచారించనుంది. ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారు ఈడీ అధికారులు. కవిత, కేజ్రీవాల్‌ను కలిపి ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈడీ విచారణకు కవిత భర్త అనిల్ హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రూ.100 కోట్ల ముడుపులపై ప్రశ్నాస్త్రాలు సంధించనుంది ఈడీ.
కవిత భర్తకు ఈడీ షాక్:
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత భర్తకు ఈడీ (ED) నోటీసులు పంపింది. రేపు(మార్చి 18) ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ సహా మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా నలుగురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకే తమ పార్టీ నాయకురాలైన కవిత పై తప్పుడు ఆరోపణలు చేసి.. కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారని ఫైర్ అవుతోంది. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అర్థం ఏంటనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటోంది.
Also Read: నా దరిద్రం అంటే ఇదే.. కావాలనే ఇలా చేస్తున్నారు: మంత్రి రోజా