/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
Delhi CM Arvind Kejriwal Petition : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా పిటిషనర్‌కు రూ.75,000 భారీ జరిమానా విధించింది. అన్ని క్రిమినల్ కేసుల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించి పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!
ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులో హైకోర్టు అసాధారణమైన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయదని తేల్చిచెప్పింది. జ్యుడిషియల్ ఆర్డర్ ఆధారంగా ఎవరైనా సరే కస్టడీలో ఉంటారని కోర్టు తెలిపింది.
Follow Us