'వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్మెంట్' అంటే ఏమిటి? ప్రభుత్వం ఈ పథకాన్నిఎందుకు తీసుకురాబోతోంది..!!

ఢిల్లీవాసులకు గుడ్ న్యూస్. వన్ టైమ్ వాటర్ బిల్ సెటిల్మెంట్ స్కీంను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఫేక్ వాటర్ బిల్లుల సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

New Update
'వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్మెంట్' అంటే ఏమిటి? ప్రభుత్వం ఈ పథకాన్నిఎందుకు తీసుకురాబోతోంది..!!

Fake water bills : ఢిల్లీవాసులకు శుభవార్త. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. త్వరలో 'వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్‌మెంట్' (One Time Water Bill Settlement')పథకాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రతిపాదనను జలమండలి (Water Board)ఆమోదించిందని తెలిపారు. త్వరలోనే మంత్రివర్గంలో ప్రతిపాదన తీసుకురానున్నట్లు వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ బిల్లును కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది. ఫేక్ వాటర్ బిల్లుల (Fake water bills)సమస్య నుండి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించడమే ఈ పథకం లక్ష్యం.

ప్రస్తుతం ఢిల్లీలో 10 లక్షలకు పైగా వినియోగదారులకు నీటి బిల్లులపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కారణంగా వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించడం మానేశారు. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం ఆ ప్రజల కోసం ఒక సమగ్ర ప్రణాళికను తీసుకువస్తుంది. ఇది వారి నీటి బిల్లు సమస్యను పరిష్కరిస్తుంది. ఈ పథకం అమలు తర్వాత ఢిల్లీ జల్ బోర్డుకు 1400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారలు తెలిపారు. ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రస్తుతం నీటి బిల్లులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. దాన్ని సరిదిద్దడానికి ఒక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. అధిక నీటి బిల్లులు ఉన్నవారు బిల్లులు చెల్లించవద్దని, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్…సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

సీఎం అరవింద్ కేజ్రీవాల్ వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు ఆదేశాలు కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేబినెట్‌లోకి తీసుకువస్తామని చెప్పాం. ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఇంతకుముందు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సోలార్ పాలసీ 2024ని ప్రకటించారు. ఇందులోభాగంగా ఇళ్లలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునే వారికి జీరో కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రజలు నెలకు రూ.700 నుంచి 900 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

ఇది కూడా చదవండి: టెడ్డీ డే అంటే ఏమిటి? ఇది ఎలా ప్రారంభం అయింది?

Advertisment
తాజా కథనాలు