యమునా నది నీటిమట్టం ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలయమయ్యాయి. ఇప్పటికే ఐటీఓ, ఎర్రకోట, ఢిల్లీ సచివాలయంతోపాటు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని వాసుల జీవనం అస్థవ్యస్థంగా మారడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ విపత్తుకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆరోపించారు. ఢిల్లీ సర్కార్ విపత్తు నిర్వహణలో లోపం ఉందని ఆరోపించారు. ఢిల్లీ వాసులారా ఇప్పటికైనా మేల్కోండి. ఏది ఉచితం కాదు..ఉచితాలకోసం పోతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుందని ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వరదల కారణంగా ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా యమునానది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అలర్ట్ చేశారు. ఈ విపత్తుపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో అత్యవసర ప్రకటనలు చేశారు. ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హర్యానా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ అదనపు నీటి కారణంగానే యమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది.
Wake up Delhiites
— Gautam Gambhir (@GautamGambhir) July 13, 2023
Delhi has become a gutter
Nothing is for free, this is the PRICE!!
बाढ़ में दिल्ली इसी लिए बह गयी क्यूंकि विकास कार्यों का पैसा प्रचार में बहाया गया! मैं लगातार राहत कार्यों का जायज़ा ले रहा हूँ और सभी पीड़ितों को हमारी जन रसोई से रोज़ाना खाना पहुँचाया जायेगा! pic.twitter.com/meT1KHi3aB
— Gautam Gambhir (@GautamGambhir) July 12, 2023