లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను వదిలిలే కనిపించడంలేదు. నిజానికి ఈ కేసు మొదటి నుంచి ఆమ్ ఆద్మి పార్టీ నేతల చుట్టూనే తిరుగుతోంది. ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీపై అనేక సార్లు రైడింగ్‌లు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇక నాలుగు రోజు క్రితం డిసెంబర్ 18న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడోసారి కూడా ఆయనకు సమన్లు ఇచ్చింది ఈడీ.
మూడోసారి:
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడో సమన్లు జారీ చేసింది . జనవరి 3న తమ ముందు హాజరు కావాలని కోరింది. నిజానికి డిసెంబర్ 18న ఇచ్చిన సమన్ల ప్రకారం కేజ్రీవాల్ డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన అటెండ్ కాలేదు. ఈడీ సమన్లను 'చట్టవిరుద్ధం', 'రాజకీయ ప్రేరణ' అని కేజ్రీవాతః మండిపడ్డారు. తాను దాచడానికి ఏమీ లేదని నొక్కి చెప్పారు. 'నేను ప్రతి చట్టపరమైన సమన్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే, ఈ ED సమన్ కూడా మునుపటి సమన్ల మాదిరిగానే చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనది. సమన్‌ను ఉపసంహరించుకోవాలి. నేను నా జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా గడిపాను. నేను దాచడానికి ఏమీ లేదు' అని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్‌కు అక్టోబర్‌లో మొదటి సమన్లు జారీ చేశారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించింది . అయితే, గతేడాది(2022) ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు. ఇదే కేసులో ఆప్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో నేత సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచిన సీబీఐ ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా తొమ్మిది గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో మద్యం పాలసీని రద్దు చేశారు.
Also Read: అశ్లీల వీడియోలు చూసే అలవాటు లోకేశ్ ది..అందుకే ఇలాంటి ఆలోచనలు- మంత్రి రోజా
WATCH: