IPL 2024 : ఢిల్లీ(Delhi) లోని అరుణ్ జైట్లీ(Arun Jaitley) క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ భారీ స్కోరీ సాధించింది. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 266పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన చరిత్ర హైదరాబాద్ పేరుతో ఉంది. తాజాగా పవర్ ప్లే తొలి 10ఓవర్లలో భారీ స్కోర్ చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.
టీ 20 చరిత్రలోనే అత్యధిక పవర్ ప్లే స్కోర్ నమోదు అయ్యింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఊచకోతతో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంత స్టేడియంలో వారి బౌలర్లను ఊచకోత కోశారు. 6 ఓవర్లలో హైదరాబాద్ ఏకంగా 125 పరుగులు చేసింది. టీ 20 క్రికెట్ హిస్టరీలో టీ20 ఇన్నింగ్స్ లో పవర్ ప్లేలో ఏ జట్టు అయినా 125 మార్కులకు చేరుకోవడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చదవండి: బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!