నేటి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిఫెండిగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరు చిదంబరం స్టేడియం వేదికగా టోర్నిలో మొదటి మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండవ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.
ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లలో దిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. కాని ఈ సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దృష్టంతా టైటిల్ పైనే ఉంది. అతడికి మద్ధతుగా రికిపాంటింగ్ కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దిల్లీ జట్లు యువబ్యాటర్లతో ఉత్సాహంగా కన్పిస్తుంది. బౌలింగ్ ,మిడిలార్డర్ లో బ్యాటింగ్ కూడా బలంగా కన్పిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో పృథ్వీషా,డేవిడ్ వార్నర్, యశ్ దుల్ ,రికీ భుయ్, జేక్ ఫ్రెజర్, లు ఉండగా ఆల్ రౌండర్ కోటాలో మిఛెల్ మార్ష్, లలిత్ యాదవ్ ,అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
ట్రిస్బన్ స్టబ్స్,షాయ్ హోప్, అభిషేక్ పోరల్,కుమార్ క్రూయల్ వికేట్ కీపింగ్ లో రిషబ్ పంత్ కు బ్యాకేండ్ వికెట్ కీపర్లు గా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్,కులదీప్ యాదవ్,ఇషాంత్ శర్మ,ఖలీల్ అహ్మాద్ లాంటి అనుభవజ్ఞ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ఫాస్ట్ బౌలర్లుగా జాయ్ రిచర్డ్స్ న్, ఎన్రీక్ నార్సియా ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టుతో దిల్లీ జట్టుకు చెందిన ఈ 11 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది.
1.పృథ్వీషా,డేవిడ్ వార్నర్,మిఛెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్),ట్రిస్బన్ స్టబ్స్,లలిత్ యాదవ్, అక్షర్ పటేల్,ముఖేష్ కుమార్,కులదీప్ యాదవ్ ,జాయ్ రిచర్డ్స్ న్,ఇషాంత్ శర్మ.