Airport: బీర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే 150 ఉంటుంది. లేదంటే 200 ఉంటుంది. కానీ ఢిల్లీ ఎయిర్ పోర్టు(Delhi Airport)లో బీర్(Price of beer) బాటిల్ ధర చూస్తే నోరెళ్లబెడతారు. అవును ఎంఆర్ పీకి కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధరకు బీరును విక్రయిస్తున్నారు. ఈ ధరతో బిర్యానీ ఫ్యామిలీ ఫ్యాక్ వస్తుంది. మొత్తం ఫ్యామిలీ తినవచ్చు. అవును ఈమధ్యే ఓ ప్రయాణికుడు ఢిల్లీ ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ధర..దాని బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
వాస్తవానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు కొనుగోలు చేసిన బీరు బాటిల్‌లో నమోదైన ఎంఆర్‌పీకి, బిల్లులో ఉన్న ఎంఆర్‌పీకి దాదాపు ఏడు రెట్లు తేడా ఉంది. షేర్ చేసిన చిత్రంలో, బీర్ బాటిల్ MRP రూ. 130 కాగా, బిల్లులో దాని ధర రూ. 735గా ఉంది. ఈ ధరలో జీఎస్టీ కూడా లేదు. ఈ బిల్లును చూసి కంగుతిన్న సదరు ప్రయాణికుడు ఎయిర్ పోర్టులోని ఆపరేటర్ డయాల్ కు ఫిర్యాదు చేశాడు.
ఎయిర్‌పోర్టులో బీర్‌ను నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్మవచ్చా? ఇప్పుడు ఏ వస్తువునైనా ప్రింట్ చేసిన ఎంఆర్‌పీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధరకు ఎయిర్‌పోర్టులో విక్రయించవచ్చా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్(National Consumer Disputes Redressal Commission) నిర్ణయం తర్వాత, ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సలహాను జారీ చేసింది. దీనిలో ఏ వస్తువుకు ఒక రాష్ట్రంలో రెండు MRPలు ఉండకూడదని లేదా వాటిని విక్రయించరాదని పేర్కొంది. MRP కంటే ఎక్కువ ధరతో ఎయిర్‌పోర్ట్‌లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో విక్రయిస్తున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎవరైనా దుకాణదారుడు ముద్రించిన MRP కంటే ఎక్కువ ధరకు ఏదైనా వస్తువును మీకు విక్రయించినట్లయితే .. నేషనల్ కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు . ఇది కాకుండా, మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ వెబ్‌సైట్ https://consumerhelpline.gov.in/ ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఏదైనా దుకాణదారుడు ప్రింటెడ్ MRP కంటే ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు మీరు తప్పనిసరిగా ఆ బిల్లును రుజువుగా చూపించాల్సి ఉంటుంది.