మణిపూర్ చేరుకున్న ఇండియా కూటమి బృందం.... ! విపక్ష ఇండియా కూటమి ప్రతినిధుల బృందం ఈ రోజు మణిపూర్ పర్యటనకు బయలు దేరింది. ఈ బృందం రెండు రోజుల పాటు పర్యటించి రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయనుంది. అనంతరం మణిపూర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రంతో పాటు పార్లమెంట్ కు విపక్ష ప్రతినిధులు బృందం సూచనలు చేయనుంది. By G Ramu 29 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి విపక్ష ఇండియా కూటమి ప్రతినిధుల బృందం ఈ రోజు మణిపూర్ పర్యటనకు బయలు దేరింది. ఈ బృందం రెండు రోజుల పాటు పర్యటించి రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయనుంది. అనంతరం మణిపూర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రంతో పాటు పార్లమెంట్ కు విపక్ష ప్రతినిధులు బృందం సూచనలు చేయనుంది. ఈ టీమ్ లో మొత్తం 21 మంది ఎంపీలు వున్నారు. విపక్ష ఎంపీల బృందం ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి కమర్షియల్ విమానంలో బయలు దేరి కాసేపటి క్రితం మణిపూర్ రాజధాని ఇంపాల్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి చురచాంద్ పూర్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడ పునరావాస కేంద్రాల్లో పర్యటించి అక్కడి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. భద్రతా పరమైన కారణాల వల్ల విపక్ష కూటమి సభ్యులు హెలికాప్టర్ ద్వారా చురచాంద్ పూర్ ప్రాంతానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక హెలికాప్టర్ అందుబాటులో వుందని అధికారులు తెలిపారు. అందువల్ల వారిని రెండు టీమ్ లుగా చేసి చురచాంద్ పూర్ తీసుకు వెళ్లనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మణిపూర్ కాంగ్రెస్ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.... లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని బృందం మొదట చురచాంద్ పూర్ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ బాలుర కళాశాలలోని హాస్టల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలిస్తారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకుంటారు. అనంతరం కాంగ్రెస్ లోక్ సభాపక్ష ఉపనేత గౌరవ్ గోగోయ్ నేతృత్వంలోని బృందం చురచందాపూర్ చేరుకుంటుంది. అక్కడ డాన్ బాస్కో స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలిస్తారని మణిపూర్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం రాజ్ భవన్ లో మణిపూర్ గవర్నర్ అనసూయను విపక్ష సభ్యుల బృందం కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమెతో చర్చించనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి