POK: ఎన్నికల వేళ POKపై రాజ్‌నాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. దాయాది దేశానికి మొదలైన దడ!

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు.

New Update
POK: ఎన్నికల వేళ POKపై రాజ్‌నాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. దాయాది దేశానికి మొదలైన దడ!

ఇండియా ఏదైనా ఒక విషయంపై గురిపెట్టిందంటే అది సక్సెస్ కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు భారత్‌ బలం, బలగం స్థాయి వేరు. ముఖ్యంగా డిఫెన్స్‌ విభాగంలో ఇండియా యమ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అందుకే శత్రు దేశాలు భారత్‌ విషయంలో ఆచుతూచీ వ్యవహరిస్తున్నాయి. ఇండియా జోలికి వచ్చేందుకు భయపడుతున్నాయి. ఇటు భారత్‌ కూడా తన పని తాను చేసుకుపోతోంది. ఎవరైనా అడ్డొస్తే మాత్రం ఇవ్వాల్సింది ఇచ్చి పడేస్తోంది. ముఖ్యంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK) విషయంలో ఇండియా స్టాండ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పీవోకే ఇండియాలో వీలినం చేసేందుకు పావులు కదుపుతోంది మోదీ సర్కార్‌. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాటలు వింటే ఈ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. పీవోకే(POK)ని భారత్ వీలినం చేస్తామంటున్నారు రాజ్‌నాథ్‌.

POK గురించి రాజ్‌నాథ్‌ ఏం అన్నారు?
హోలీ పండుగ సందర్భంగా లెహ్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాలను సందర్శించిన రాజ్‌నాథ్‌ పీఓకే పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్ ప్రజలే భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారన్నారు రాజ్‌నాథ్ సింగ్. పీవోకే స్వయంచాలకంగా భారత్‌లో కలిసిపోతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. POK మనదేనని చెప్పుకొచ్చారు. POK గురించి ఆందోళన చెందాల్సింది పాకిస్థాన్‌ అని తెలిపారు. నిజానికి POK ప్రజలే భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇండియా ఏ దేశంపైనా దాడి చేయబోదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఎప్పుడూ దాడి చేయలేదు కూడా అని చెప్పారు. అయితే ఎవరైనా తమ ప్రతిష్టపై దాడి చేస్తే భారత్ తగిన విధంగా స్పందిస్తుందని కుండబద్దలు కొట్టారు రాజ్‌నాథ్‌.

చైనా గురించి రాజ్‌నాథ్‌ ఏం అన్నారు?
భారత్‌పై చైనా దాడి చేస్తే.. అలాంటి తప్పులు చేయకుండా ఉండేలా దేవుడు వారికి బుద్ధి చెప్పాలని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఏ దేశమైనా మనపై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. అయితే ఇరుగుపొరుగు వారందరితో మనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నది నిజమన్నారు. చైనా నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా భారత్ ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు. భారత్‌ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందని తెలిపారు. భారత్‌లోని దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను రాజ్‌నాథ్‌ తప్పుపట్టారు. మన సైనికుల ధైర్యసాహసాలపై రాహుల్ ప్రశ్నలు సంధిస్తున్నారని... ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కౌంటర్ వేశారు.

Also Read: 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బావమరిది.. ఎందుకంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు