Deepthi Sunaina: ఆటో నడుపుతున్న బిగ్ బాస్ బ్యూటీ.!

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఆటో నడుపుతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్ సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

New Update
Deepthi Sunaina: ఆటో నడుపుతున్న బిగ్ బాస్ బ్యూటీ.!

Deepthi Sunaina: దీప్తి సునైనా (Deepthi Sunaina) ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది ఈ బ్యూటీ. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరోవైపు ఫొటోషూట్స్‌తోనూ సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించింది.

publive-image

షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్ సిరీసులతోపాటు మ్యూజిక్ ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌తో ప్రేమించింది ఈ అందాల భామ. అయితే షణ్ముక్ బిగ్ బాస్ వెళ్లిన తర్వాత తన లవ్ కు బ్రేకప్ చెప్పింది. ఆ తరువాత మధ్యలో కాస్త జోరు తగ్గించింది ఈ అమ్మడు.

publive-image

అయితే, మళ్లీ ఇప్పుడు జోరు పెంచింది దీప్తి సునైనా. మునుపటిలా ఫొటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. సినిమాల్లో నటించికపోయిన స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ను దక్కించుకుంది.

publive-image

Also read: డార్లింగ్ గా మారబోతున్న ప్రభాస్.. నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

Advertisment
తాజా కథనాలు