Tamilnadu: కల్తీసారా ఘటనలో..58 మందికి చేరిన మృతుల సంఖ్య!

తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరణాల సంఖ్య 58 కు చేరుకుంది. మరో వైపు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు.

New Update
Tamilnadu:  కల్తీసారా ఘటనలో..58 మందికి చేరిన మృతుల సంఖ్య!

Kallakurichi Hooch Tragedy: తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరణాల సంఖ్య 58 కు చేరుకుంది. మరో వైపు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీళ్లలో 110 మంది కళ్లకురిచ గవర్నమెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన పై రాజకీయ దుమారం రేపుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M. K. Stalin) రాజీనామా చేయాలని బీజేపీ (BJP) డిమాండ్‌ చేస్తుంది. రాష్ట్ర ప్రొహిబిషన్‌ మంత్రి ముత్తుసామిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ దుర్ఘటన బాధితులను ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించలేదని బీజేపీ ప్రశ్నించింది.

ఈ ఘటన పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి (Palaniswami) నేతృత్వంలో అన్నాడీఎంకే సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. కల్తీసారా ఘటనలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహార ప్రకటించింది. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లల విద్య, హాస్టల్‌ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారు.

Also Read: వానల గురించి వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌…ఎప్పటి వరకు కురుస్తాయంటే!

Advertisment
తాజా కథనాలు