Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన డీఏ 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం అంటే డీఏను 4% పెంచూతున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు అంటే జనవరి-జూలై నెలల్లో డీఏ పెంచుతుంది. 

author-image
By KVD Varma
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరిగిన డీఏ 
New Update

Dearness Allowance: కేంద్ర ఉద్యోగులకు అందుతున్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచింది. ఈరోజు అంటే మార్చి 7న జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏను 4% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. డీఏ పెంపు తర్వాత ఉద్యోగుల భత్యం 46% నుంచి 50%కి పెరిగింది. దీని వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ(Dearness Allowance)ను 46% నుంచి 50%కి పెంచడం వల్ల హౌస్ రెంట్ ఎలవెన్స్ కూడా పెరుగుతుంది. గ్రాడ్యుటీ పరిమితి కూడా 20 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది.డీఏ 4% పెంపుతో ప్రభుత్వంపై రూ.12,868 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

అంతకుముందు, ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో డీఏను 4% పెంచి 46%కి చేర్చింది. డియర్‌నెస్ అలవెన్స్‌(Dearness Allowance)ను జనవరి - జూలైలో సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని ఏడాది పాటు పొడిగించింది. అంటే ఈ పథకం వినియోగదారులు మరో ఏడాది పాటు రూ. 300 సబ్సిడీని పొందుతారు. దీని వల్ల 10 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉజ్వల సిలిండర్ రూ.603కు అందుబాటులో ఉంది.

Also Read:  ఢిల్లీలో సీఎం రేవంత్.. 9 మందితో తొలి జాబితా?

ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం ప్రతి 6 నెలలకు డీఏను లెక్కిస్తారు..
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కొనసాగించడానికి డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance) ఇవ్వడం జరుగుతుంది.  ఈ సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు అందజేస్తారు. దేశం ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం దీని గణన ప్రతి 6 నెలలకు జరుగుతుంది. ఇది సంబంధిత పే స్కేల్ ఆధారంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనం ప్రకారం లెక్కిస్తారు. అర్బన్, సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ భిన్నంగా ఉండవచ్చు.

#dearness-allowence #central-government-employees
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe